Cricket: భారత అండర్-19 క్రికెట్‌ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా

  • ఇటీవల జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టేసిన టీమిండియా
  • పాక్‌పై 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు 
  • అండర్-19 క్రికెట్‌ జట్టు భారత్‌కు రాగానే సన్మానం కూడా
  • భారీ నజరానా అందుతుందంటోన్న విశ్లేషకులు

అండర్-19 వరల్డ్ కప్‌లో ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు అదరగొట్టేసిన విషయం తెలిసిందే. పాక్‌పై ఏకంగా 203 పరుగుల  తేడాతో ఘన విజయం సాధించింది. వచ్చేనెల 3న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. కోచ్ రాహుల్ ద్రవిడ్‌ నేతృత్వంలోని యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని, భవిష్యత్తులో వీరు మరింత మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నామని బీసీసీఐ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఫైనల్‌ చేరిన  జట్టుకు నగదు ప్రోత్సాహం అందజేస్తామని అధికారికంగా ప్రకటన చేశారు. అండర్-19 జట్టు భారత్ చేరుకున్న తరువాత ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీమిండియా కుర్రాళ్లకు బీసీసీఐ భారీగానే నజరానా అందించనుందని విశ్లేషకులు చెబుతున్నారు.  

Cricket
India
bcci
  • Loading...

More Telugu News