Donald Trump: ట్రంప్ స్టేట్ ఆఫ్ యూనియ‌న్‌ ప్ర‌సంగానికి కూచిబొట్ల శ్రీనివాస్ భార్య‌

  • సున‌య‌న దుమ్మ‌ల‌కు ప్ర‌త్యేక ఆహ్వానం
  • కేన్సాస్‌లో హ‌త్య‌కు బ‌లైన‌ శ్రీనివాస్‌
  • ఆ సంఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన మ‌రో ఇద్దరు

గతేడాది అమెరికాలోని కేన్సాస్‌లో జాతివివ‌క్ష హ‌త్య‌కు బ‌లైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ కూచిబొట్ల శ్రీనివాస్ భార్య సున‌య‌న దుమ్మ‌ల‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే 'స్టేట్ ఆఫ్ యూనియ‌న్' ప్ర‌సంగానికి ఆహ్వానించినట్లు రిప‌బ్లిక‌న్ కెవిన్ యోడ‌ర్ తెలిపారు. 'అధ్యక్షుడి స్టేట్ ఆఫ్ యూనియ‌న్ ప్ర‌సంగానికి ఏడాదికి ఒక‌రికి ప్ర‌త్యేక ఆహ్వానం పంపిస్తాం. ఈ ఏడాదికి గాను గ‌తేడాది ఒలాథేలో వివ‌క్ష హ‌త్య‌కు గురైన కూచిబొట్ల శ్రీనివాస్ భార్య సున‌య‌న దుమ్మ‌ల‌ను ఆహ్వానించాం' అని యోడ‌ర్ ట్వీట్ చేశారు.

ఓ హోటళ్లో స్నేహితులు అలోక్ మాద‌సాని, ఇయాన్ గ్రిలాట్‌ల‌తో క‌లిసి కూర్చున్న శ్రీనివాస్‌పై `మా దేశం నుంచి వెళ్లు` అంటూ ఓ వ్య‌క్తి కాల్పులు జ‌రిపాడు. ఆ కాల్పుల్లో శ్రీనివాస్ మృతి చెందగా అలోక్‌, ఇయాన్‌లు తీవ్రంగా గాయప‌డ్డారు. ప‌ర‌దేశీ అయిన‌ప్ప‌టికీ స్నేహం కోసం శ్రీనివాస్‌ని కాపాడే ప్ర‌య‌త్నంలో ఇయాన్ తీవ్ర గాయాల పాల‌య్యాడు. దేశ వాణిజ్య సంబంధాలు, వ‌ల‌స‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించడానికి అమెరికా అధ్య‌క్షుడి స్టేట్ ఆఫ్ యూనియ‌న్ ప్ర‌సంగాన్ని ఏర్పాటు చేస్తారు.

  • Loading...

More Telugu News