assembly seats: అసెంబ్లీ సీట్ల పెంపుపై బీజేపీలో కదలిక.. ఏపీ, టీఎస్ బీజేపీ కీలక నేతలకు అమిత్ షా నుంచి పిలుపు!

  • రేపు అమిత్ షా నివాసంలో భేటీ
  • కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
  • విశాఖ రైల్వే జోన్, హైకోర్టులపై కూడా నిర్ణయం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు శుభవార్త. ఇరు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు విషయంలో బీజేపీలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో, వెంటనే ఢిల్లీకి బయలుదేరి రావాలంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ కీలక నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. రేపు ఢిల్లీలో అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరగబోతోంది.

ఈ భేటీకి ఏపీ నుంచి హరిబాబు, విష్ణుకుమార్ రాజు... తెలంగాణ నుంచి లక్ష్మణ్, కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరవుతున్నారు. ఈ భేటీలో సీట్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో విశాఖ రైల్వే జోన్, ఏపీ హైకోర్టుకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీట్ల పెంపుకు సంబంధించి టీడీపీ, టీఆర్ఎస్ నేతలతో కూడా అమిత్ షా చర్చించబోతున్నారు.

assembly seats
ap
Telangana
amit shah
visakhapatnam railway zone
ap high court
  • Loading...

More Telugu News