elections: 'జమిలి' ఎన్నికలను ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
- మోదీ మరింత గట్టిగా ప్రచారం చేయగలరు
- విడిగా ఎన్నికలు జరిగితేనే ఎదుర్కోగలం
- కాంగ్రెస్, ఇతర పక్షాల్లో ఏక కాలంలో ఎన్నికల పట్ల వ్యతిరేక
చీటికీ మాటికీ దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగే వాతావరణం ఉండరాదని, దానివల్ల అధిక నిధుల వ్యయాలు, విలువైన సమయం వృథా అవుతుందంటూ కేంద్రంలోని మోదీ సర్కారు ఓ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏక కాలంలో దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్ సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేస్తే ఇక ఐదేళ్ల వరకు ప్రజా పాలనపైనే ప్రభుత్వాలు దృష్టి పెట్టే అవకాశం ఉంటుందన్నది మోదీ సర్కారు ఆలోచన.
కానీ, ప్రతిపక్షాలు ఇందుకు ఇప్పటికైతే సుముఖంగా లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే, మోదీ ప్రతిపాదన ఆయనకే లాభిస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రధానంగా ఈ ప్రతిపాదనకు ఓకే అంటే మరో ఏడాదిలోపే జరిగే ఎన్నికలు మోదీకే లాభిస్తాయన్నది కాంగ్రెస్ యోచన.
ఏక కాలంలో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలనా కాలం పొడిగింపు లభిస్తుందని (రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఈ ఏడాది చివర్లో ఎన్నికలు), దీంతో మోదీ వీటన్నింటిలో ఏక కాలంలో సమగ్రమైన ప్రచార వ్యూహం అమలు చేసే వీలు లభిస్తుందని ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో మరింత గట్టిగా ప్రతిపక్షాలపై పైచేయి సాధించడానికి అవకాశంగా మారుతుందనే ఆందోళన ఉంది. అలా కాకుండా విడిగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తే, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ స్థానిక అంశాలు ప్రస్ఫుటమవుతాయని, గుజరాత్ లో మాదిరిగా గట్టిపోటీ ఇవ్వొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.