Bollywood: సినీ నటుడితో ప్రేమ వ్యవహారం అన్నది సవాళ్లతో కూడుకున్నది: పరిణీతి చోప్రా

  • బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు గుట్టుచప్పుడుగా ఉండవు
  • నేనింతవరకు ఏ నటుడితోనూ డేటింగ్ చేయలేదు
  • అసలు నటుడిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు గుట్టుచప్పుడుగా ఉండవని ప్రముఖ నటి పరిణీతి చోప్రా తెలిపింది. దర్శకుడు మనీష్ శర్మతో ప్రేమలో ఉండి, మూడేళ్ల క్రితం విడిపోయిన పరిణీతి బాలీవుడ్ లో లవ్, డేటింగ్ అన్నవి చాలా కష్టమని అభిప్రాయపడింది. అందుకే తాను ఏ నటుడితోనూ డేటింగ్‌ చేయలేదని చెప్పింది. అంతే కాకుండా, ఎవరితోనైనా డేటింగ్ చేసి, అతనిని పెళ్లి చేసుకోవాలని కూడా లేదని తెలిపింది.

చిత్రపరిశ్రమలో ప్రేమ వ్యవహారం కొనసాగించడం చాలా కష్టమని పేర్కొంది. కనీసం స్నేహంగా ఉందామన్నా కుదరదని చెప్పింది. సినీ పరిశ్రమలోని వారితో ప్రేమ వ్యవహారం సవాలుతో కూడుకున్నదని పరిణీతి చెప్పింది. కాగా, మనీష్ శర్మతో విడిపోయిన పరిణీతి, హార్దిక్ పాండ్యతో ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను ఇద్దరూ ఖండించారు.

Bollywood
parineeti chopra
pari about love
  • Loading...

More Telugu News