samantha: హీరోయిన్ సమంత చేతికి ఏమైంది? ఎందుకు కట్టు కట్టుకుంది?

- శరవేగంగా 'రంగస్థలం' షూటింగ్
- హార్డ్ వర్క్ వల్ల సమంతకు చేయి నొప్పి
- రిలీఫ్ కోసం చేతికి కట్టు
'రంగస్థలం' చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా సమంత నటిస్తోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, చేతికి కట్టు కట్టుకుని ఉన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె చేతికి ఏమైందో అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే... కొన్ని కీలకమైన సీన్స్ తో పాటు రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ను ఇటీవలే రాజమండ్రి షెడ్యూల్ లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ అంతా చాలా టైట్ గా కొనసాగింది.
