rashmika mandana: తొలి సినిమా షూటింగులోనే ప్రేమలో పడ్డాను...అతన్నే పెళ్లి చేసుకుంటాను: కథానాయిక రష్మిక

  • నాగశౌర్యకు జంటగా నటించిన రష్మిక మండన్న
  • కన్నడలో 'కిరిక్ పార్టీ' సినిమాతో వెండితెర అరంగేట్రం
  • ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే హీరోతో ప్రేమాయణం

నాగశౌర్యకు జంటగా ‘ఛలో’ సినిమాలో నటించిన కన్నడ నటి రష్మికా మండన్న తన తొలి సినిమా హీరోను వివాహం చేసుకుంటానంటోంది. 'ఛలో' సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, కన్నడలో 'కిరిక్ పార్టీ' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన రష్మిక, ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డానని తెలిపింది. తమ ఇద్దరి మనసులు కలిశాయని చెప్పింది.

దాంతో పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని రష్మిక తెలిపింది. రక్షిత్ కేవలం మంచి నటుడు మాత్రమే కాదని, మంచి రచయిత కూడా అని చెబుతోంది. 'ఛలో' సినిమా తెలుగులో తనకు మంచి అవకాశాలు తెస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో సరిహద్దు దాటి వచ్చిన కుర్రాడితో ప్రేమలో పడతానని చెప్పింది. సినిమా చాలా బాగా వచ్చిందని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపింది. నటిగా అనుష్క తరహాలో పేరుతెచ్చుకోవాలని ఉందని చెప్పింది.  

rashmika mandana
kannada actress
love marriage
  • Loading...

More Telugu News