jio: జియో రూ.49 ఆఫర్‌పై మరో గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా ఈ ప్లాన్ వాడుకోవచ్చు!
- జియో రూ.49 ప్లాన్ కేవలం జియోఫోన్ ఉన్నవారికి మాత్రమే కాదు
- జియోఫోన్‌లో జియో సిమ్‌కార్డు వేసి రూ.49 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి
- ఆ తరువాత జియోఫోన్ నుంచి ఆ సిమ్ తీసేసి, ఇతర స్మార్ట్‌ఫోన్‌లో వేసుకుని, ఈ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు
- ఇదే విధంగా రూ.153 ప్లాన్‌ను సైతం ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో వాడుకోవచ్చు
ఉచిత మంత్రంతో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని రీతిలో వినియోగదారులను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో.. అద్భుతమైన ఆఫర్లు తీసుకొస్తూ వినియోగదారులను ఇప్పటికీ ఆకర్షిస్తోంది. కాగా, తాజాగా జియో ప్రకటించిన రూ.49 ప్లాన్ కస్టమర్లను కాస్త అయోమయానికి గురి చేస్తోంది. ఈ ప్లాన్‌తో 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 1 జీబీ డేటాను వాడుకోవచ్చని ఇటీవలే ఆ కంపెనీ పేర్కొంది. అయితే, ఈ ప్లాన్‌ను జియో ఫోన్‌లో మాత్రమే ఉపయోగించుకోవచ్చని కొందరు వినియోగదారులు అనుకుంటున్నారు. కానీ, ఇతర కంపెనీల 4జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌ను ఇతర స్మార్ట్‌ఫోన్లలోనూ వాడుకోవాలంటే.. ఏం చేయాలి?
మొదట జియో సిమ్‌ను జియోఫోన్‌లో వేసుకోని రూ.49 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా యాక్టివేట్ చేసుకున్న తరువాత ఆ సిమ్‌ను బయటికి తీసి, ఇతర స్మార్ట్‌ఫోన్‌లో వేసుకుంటే ఈ ప్లాన్ యాక్టివేట్‌లోనే ఉంటుంది. జియోఫోన్‌లో మాత్రమే ఈ ప్లాన్‌ను వాడుకోవాలనే నిబంధనను సదరు కంపెనీ పెట్టలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే రూ.49 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి జియో సిమ్ కార్డును జియో ఫోనులో వేసి, యాక్టివేట్ చేసుకుని, మళ్లీ మీ ఇతర స్మార్ట్‌ఫోనులో వేసుకోవాలి. అంతేకాదు, జియో అందిస్తోన్న రూ.153 ప్లాన్‌ను కూడా ఇదే విధంగా యాక్టివేట్ చేసుకుని ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా వాడుకోవచ్చు.