students: రైల్వేస్టేషన్‌లో మార‌ణాయుధాల‌తో దాడులు చేసుకున్న విద్యార్థులు.. ఏడుగురికి తీవ్ర‌గాయాలు

  • త‌మిళ‌నాడులోని తిరువ‌ళ్లూరు జిల్లా పట్ర‌వాక్కం రైల్వే స్టేష‌న్‌లో ఘటన
  • చేతుల్లో కత్తులు పట్టుకుని పరుగులు తీస్తూ, వెంబడిస్తూ దాడులు
  • సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తోన్న పోలీసులు
  • ఇప్పటివరకు ఇద్దరి అరెస్ట్

త‌మిళ‌నాడులోని తిరువ‌ళ్లూరు జిల్లా పట్ర‌వాక్కం రైల్వే స్టేష‌న్‌లో రెండు గ్రూపులకు చెందిన విద్యార్థులు తీవ్ర కలకలం రేపారు. మారణాయుధాలతో ఇరు వర్గాలు దాడి చేసుకోవడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరిన లోకల్ ట్రైన్ పట్టరైవాకం స్టేషన్‌కు చేరుకోగానే ఈ ఘటన చోటు చేసుకుంది. చేతుల్లో కత్తులు పట్టుకుని పరుగులు తీస్తూ, వెంబడిస్తూ దాడులు చేసుకోవడంతో ఆ రైల్లో ఉన్న ఇతర ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిసింది.

students
arrest
Tamilnadu
railway station
  • Loading...

More Telugu News