hello: తండ్రికి గొప్ప మెసేజ్‌తో బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన 'హ‌లో' న‌టి క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌

  • 'నువ్వు సృష్టించిన క‌ళాఖండాల్లో ఉత్త‌మ‌మైన‌ది నేనేన‌ని నా ఫీలింగ్‌' అని ట్వీట్‌
  • క‌ల్యాణి వ‌ర్ణ‌న‌ను పొగిడేస్తున్న నెటిజ‌న్లు
  • ఇవాళ 61వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రియ‌ద‌ర్శ‌న్‌

ఇవాళ‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కూతురు, 'హ‌లో' సినిమా హీరోయిన్ క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా విషెస్ తెలిపింది. అందులో భాగంగా ఓ అద్భుత భావంతో కూడా వాక్యాన్ని జోడించింది. ఆ ఒక్క వాక్యంతో ఆమె అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటూ తండ్రికి త‌గ్గ త‌న‌య అని నిరూపించుకుంటోంది.

'సెట్లో ప‌నిచేస్తున్న ఆయ‌న‌ను చూస్తూ నేను పెరిగాను. త‌ల మీద పెద్ద టోపీ, న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు, సినిమాల గురించి నాకు పాఠాలు, మ‌ధ్య‌మ‌ధ్య‌లో యాక్ష‌న్ అనే అరుపులు. ఇవాళ ఆయ‌న‌కు 61 ఏళ్లు. అయినా ఏం మార‌లేదు. హ్యాపీ బ‌ర్త్‌డే అచ్చా! నువ్వు 90 గొప్ప సినిమాలు తీసుండొచ్చు... కానీ నువ్వు సృష్టించిన క‌ళాఖండాల్లో ఉత్తమ‌మైన‌ది నేనేన‌ని నా ఫీలింగ్‌' అని క‌ల్యాణి ట్వీటింది. ట్వీట్‌తో పాటు త‌న తండ్రితో క‌లిసి ఉన్న త‌న చిన్న‌ప్ప‌టి ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది.

hello
kalyani priyadarshan
priya darshan
tweet
  • Error fetching data: Network response was not ok

More Telugu News