Instagram: ఇన్స్టాగ్రామ్ లో వీడియో కాలింగ్ ఫీచర్.. లీక్!

  • బ్లాగ్ లో బయటపడిన స్ర్కీన్ షాట్
  • టెస్టింగ్ లో ఉన్నట్టు సమాచారం
  • కొన్ని నెలల్లోనే అందుబాటులోకి ఫీచర్

ప్రముఖ ఫొటో షేరింగ్ అప్లికేషన్ దిగ్గజం ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని ఈ సంస్థ అందించబోతోంది. అయితే, ఈ విషయంపై మాట్లాడేందుకు ఇన్స్టాగ్రామ్ అధికారికంగా నిరాకరించింది.

వీడియో కాలింగ్ ఫీచర్ ను ఇన్స్టాగ్రామ్ తీసుకొస్తున్న విషయం వాట్సాప్ ఫ్యాన్ బ్లాగ్ 'WABetaInfo'లో బయటపడింది. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంటర్నల్ టెస్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం. లీక్ అయిన స్క్రీన్ షాట్ ప్రకారం పైన, కుడివైపు భాగంలో వీడియో కాల్ ఐకాన్ కనబడుతోంది. వాట్సాప్ మాదిరే ఇందులో కూడా ఉంది. కొన్ని నెలల్లోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైజెస్ లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోందని తెలుస్తోంది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News