ilayaraja: ఇళయరాజా బ్రాహ్మణుడు కావాలని ప్రయత్నిస్తున్నారు: భారతీరాజా తీవ్ర వ్యాఖ్యలు

  • బ్రాహ్మణుడు అయిపోవాలని ఇళయరాజా ప్రయత్నిస్తున్నాడు
  • కలకలం రేపుతున్న భారతీరాజా వ్యాఖ్యలు
  • ఖండించిన బీజేపీ నేత రాజా

మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన తర్వాత... దానికి కులం మరక అంటుకుంది. దళితుడు కావడం వల్లే ఇళయరాజాకు పద్మవిభూషణ్ వచ్చిందంటూ ఓ పత్రిక రాసిన కథనం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. అది ఇంకా చల్లారక ముందే మరో కలకలం రేగింది. రాజాపై ఈసారి ప్రముఖ సినీ దర్శకుడు భారతీరాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దళితుడు కావడం వల్లే ఇళయరాజాకు అవార్డు వచ్చిందని కొందరు అంటున్నారని... మరోవైపు ఇళయరాజా బ్రాహ్మణుడు అయిపోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆయన అన్నారు. భారతీరాజా వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా స్పందించారు. అయ్యర్ అంటే గౌరవింపదగిన వ్యక్తి అని... ఆ రకంగా చూస్తే, ఇళయరాజా ఇప్పటికే అయ్యర్ అయిపోయారని అన్నారు.

ఒకప్పుడు ఇళయరాజా, భారతీరాజాలు మంచి స్నేహితులు. హిట్ కాంబినేషన్ గా పేరు పొందారు. అయితే, ఆ తర్వాతి కాలంలో వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. బహిరంగంగానే ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు.

ilayaraja
bharathi raja
kollywood
brahmin
padma vibhushan
  • Loading...

More Telugu News