10 gb: 10 జీబీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేస్తున్న వివో?
- ప్రపంచంలోనే తొలి సూపర్‌స్పీడ్ స్మార్ట్‌ఫోన్
- 256 జీబీ/512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
- అధికారికంగా ప్రకటించకున్నా వైరల్ అవుతున్న వార్త
ర్యామ్ ఎంత ఎక్కువగా ఉంటే స్మార్ట్‌ఫోన్ అంత వేగంగా పనిచేస్తుంది. వినియోగదారులకు అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్ అందించేందుకు చైనా కంపెనీ వివో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 10 జీబీ ర్యామ్ గల ఫోన్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు సమాచారం. వివో ఎక్స్‌ప్లే 7 పేరుతో వివో తయారుచేస్తున్న స్మార్ట్‌ఫోన్లో 10 జీబీ ర్యామ్, 256 జీబీ/512 జీబీ అంతర్గత మెమొరీ ఉంటుందని ఓ వార్త ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఆ వార్త నిజమే అయితే ప్రపంచంలోనే తొలి సూపర్ స్పీడ్ స్మార్ట్‌ఫోన్ ఇదే అవుతుంది.
ఇంకా ఇందులో ఉన్న ఇతర ఫీచర్లు కూడా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. అయితే వివో కంపెనీ వీటి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అందుకే ఫీచర్లు, ధరల విషయంలో కూడా స్పష్టత కొరవడింది. త్వరలోనే ఈ ఫోన్‌ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాగా.. దీని ప్రారంభ ధర 500 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 31,800గా ఉండనున్నట్లు తెలుస్తోంది.