Deepika Padukone: 100 కోట్ల మార్క్ దాటిన 'పద్మావత్' .. శంకర్ ప్రశంసలు

  • వివాదాల నడుమ రిలీజైన పద్మావత్ 
  • 200 కోట్ల క్లబ్ దిశగా పరుగులు 
  • ఈ సినిమా టీమ్ ను అభినందించిన శంకర్

దీపికా పదుకొనే .. రణ్ వీర్ .. షాహిద్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'పద్మావత్' .. ఈ నెల 25వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా పలు వివాదాల మధ్య విడుదలైనప్పటికీ, భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ ఏడాది 100 కోట్ల మార్క్ ను దాటిన తొలి చిత్రంగా ఇది నిలిచింది.

వసూళ్ల పరంగా ఇదే ఊపు కొనసాగితే, 200 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా అవలీలగా చేరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాను చూసి దర్శకుడిని .. నటీనటులను అభినందించినవారి జాబితాలో ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కూడా చేరిపోయారు. " 'పద్నావత్' చిత్రం అద్భుతంగా వుంది .. సన్నివేశాల చిత్రీకరణ అమోఘంగా వుంది. దీపికా .. రణ్ వీర్ .. షాహిద్ నటన, దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ పనితీరును మాటల్లో చెప్పలేం. 'ఘూమార్ ..' సాంగ్ అద్భుతం .. ఎంతగానో ఆకట్టుకుంది " అంటూ ఆయన ట్వీట్ చేశారు.      

  • Loading...

More Telugu News