Deepika Padukone: తండ్రి విజ‌యాలు చూసి కంట‌త‌డి పెట్టుకున్న దీపికా ప‌దుకునే!

  • ప్ర‌కాశ్ ప‌దుకునేకు జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం
  • వేడుక నిర్వ‌హించిన బ్యాడ్మింటన్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా
  • హాజ‌రైన పీవీ సింధు

బ్యాడ్మింట‌న్ ఆట‌లో విజ‌యాలు సాధించి దేశ‌ఖ్యాతిని పెంచినందుకుగాను ప్ర‌కాశ్ ప‌దుకునేకు బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా జీవిత సాఫ‌ల్య పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ప‌దుకునే కుటుంబం హాజ‌రైంది. అక్క‌డ తండ్రి అవార్డు అందుకునేట‌పుడు కుమార్తె దీపికా ప‌దుకునే కళ్ల‌లో నీళ్లు తిరిగాయి.

ఢిల్లీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి దీపికా త‌ల్లి ఉజ్జ‌ల, సోద‌రి అనిశా, బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు హాజ‌ర‌య్యారు. ఈ వేడుకలో దీపికా వ‌స్త్ర‌ధార‌ణ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. దీపికా క‌ట్టుకోవ‌డం వ‌ల్ల స‌బ్య‌సాచి డిజైన్ చేసిన ఈ చీర‌కు కొత్త అందం వ‌చ్చింద‌ని అంద‌రూ అంటున్నారు.

  • Loading...

More Telugu News