union budget: కేంద్ర బడ్జెట్ నుంచి కీలకమైన రంగాలు ఆశిస్తున్నవి ఇవే!
- గురువారం బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న కేంద్రం
- వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఉండవచ్చని అంచనాలు
- ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్పొరేట్ రంగాలు
రానున్న గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. వ్యవసాయ రంగానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వబోతోందని, వ్యాపార రంగానికి అనుకూలంగా బడ్జెట్ ఉండవచ్చని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏయే కార్పొరేట్ రంగాలు బడ్జెట్ నుంచి ఏమేం ఆశిస్తున్నాయో చూద్దాం.
బ్యాంకింగ్:
అప్పులు తీసుకున్నవారి నాన్ పర్ఫామింగ్ అస్సెట్స్ పై పూర్తి స్థాయిలో ట్యాక్స్ ఎత్తివేత.
బ్యాంక్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీకి సంబంధించి... ప్రస్తుత కనిష్ట డిపాజిట్ల స్థాయిని రూ. 10వేలకు మించి పెంచడం.
రీటెయిల్ టర్మ్ డిపాజిట్లకు సంబంధించి ట్యాక్స్ మినహాయింపులను 5 ఏళ్ల కాల పరిమితి నుంచి 3 ఏళ్లకు తగ్గించడం.
ఇన్ సాల్వెన్సీ కోడ్ కింద ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడం.
టెక్నాలజీ/ఐటీ:
డిజిటల్ ట్రాన్జాక్షన్స్ కు ఎక్కువ ఇన్సెన్టివ్ లు ఇవ్వడం.
డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సహకారం అందించడం.
మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్ కంప్యూటర్లకు సంబంధించి అనుకూలమైన ఎక్సైజ్ డ్యూటీ.
టారిఫ్ స్ట్రక్చర్ ను మరింత అనుకూలంగా మార్చడం.
ఆటోమొబైల్:
కాలం చెల్లిన కమర్షియల్ వాహనాలపై నిషేధం.
ఎలెక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు.
రియలెస్టేట్:
రియలెస్టేట్ ప్రాజెక్టులకు సింగిల్ విండో క్లియరెన్స్.
ఫైనాన్స్, ప్రాజెక్ట్ కాస్ట్ ను తగ్గించుకోవడం, ఇళ్లను తక్కువ ధరకే అందించడం కోసం రియలెస్టేట్ కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇవ్వడం.
ప్రస్తుతం 12 శాతం ఉన్న జీఎస్టీని తగ్గించడం.
స్టాంప్ డ్యూటీని కూడా తగ్గించడం.
ట్యాక్స్:
కార్పొరేట్ ట్యాక్స్ ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం.
మినిమన్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడం.
వ్యక్తిగతమైన పన్ను రాయితీలను పెంచడం.
దీర్ఘకాల పెట్టుబడులపై ట్యాక్స్ విధింపు.
వ్యవసాయం:
వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రుణ లభ్యతకు సంబంధించి ఫండ్ ఏర్పాటు.
పంటల బీమా కోసం ఎక్కువ నిధులను మంజూరు చేయడం.
డ్యాములు, కెనాల్స్, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ కోసం ఎక్కువ పెట్టుబడులు.
కోల్డ్ స్టోరేజ్ ల నిర్మాణాలకు సబ్సిడీలు.
ఫర్టిలైజర్స్ పై సబ్సిడీలను తగ్గించడం.
ఆయిల్ అండ్ గ్యాస్:
ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి సెస్ డ్యూటీని 20 శాతం నుంచి 8-10 శాతానికి తగ్గించడం.
సహజవాయువుపై జీఎస్టీ తగ్గింపు.
గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఎక్సైజ్ డ్యూటీలో మినహాయింపు లేదా తగ్గింపు.
లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ దిగుమతులకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు.
మార్కెట్ ధర కంటే తక్కువకు కిరోసిన్, గ్యాస్ ను అమ్ముతున్న కంపెనీలకు సబ్సిడీలు.
మెటల్స్ అండ్ మైనింగ్:
వంటకు వాడే బొగ్గుపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.
ఐరన్ ఓర్ ఎగుమతులపై సుంకం తగ్గింపు.
దేశీయ పరిశ్రమలను కాపాడేందుకు అల్యూమినియమ్ స్క్రాప్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచడం.
మినరల్స్ అన్వేషణ కార్యక్రమానికి చేయూతనివ్వడం.
బంగారం:
స్మగ్లింగ్ ను అరికట్టేందుకు దిగుమతులపై ఉన్న ట్యాక్స్ ను 10 శాతం నుంచి 2-4 శాతానికి తగ్గించడం.