Telangana: 500 రూపాయలిచ్చి సంగారెడ్డి జైలులో రెండు రోజులున్న మలేషియన్లు!

  • సంగారెడ్డి జైలులో ఫీల్ ద జైల్ కాన్సెప్ట్ సదుపాయం వినియోగించుకున్న మలేషియన్లు
  • రెండు రోజుల జైలు జీవితం
  • ఘనంగా సెండాఫ్ ఇచ్చిన జైలు అధికారులు

సంగారెడ్డి జిల్లా జైలు అధికారుల ఐడియా నచ్చిన ఇద్దరు మలేషియన్లు 500 రూపాయల చొప్పున చెల్లించి జైలు జీవితం అనుభవించారు. డబ్బులిచ్చి జైలుకెళ్లడమేంటన్న అనుమానం వచ్చిందా? సంగారెడ్డి జిల్లా జైలు అధికారులు 'ఫీల్ ద జైల్' కాన్సెప్ట్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఐడియా నచ్చిన మలేషియాలోని కౌలాలంపూర్‌ కు చెందిన డెంటిస్ట్ కెన్నీ ఎన్జీ, అతని స్నేహితుడు కెల్విన్ ఓంగ్‌ లు రెండు రోజుల జైలు జీవితం అనుభవించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇండియా పర్యటనకు వచ్చిన తమకు సంగారెడ్డిలోని కండీ జైలు నచ్చిందని అన్నారు. తొలిరోజు ఖైదీల భోజనమే చేశామని, అన్నంతో పాటు చపాతీలు కూడా తిన్నామని తెలిపారు. నేలపై పడుకోవడం కొంత ఇబ్బంది పెట్టిందని తెలిపారు. ఇక జైలు జీవితంలో వీరు మొక్కలకు నీరు పోశారు. కొన్ని తెలుగు పదాలు కూడా నేర్చుకున్నారు. అనంతరం వారికి జైలు అధికారులు ఘనంగా సెండాఫ్ ఇచ్చారు.

కాగా, 2016 సెప్టెంబర్ లో సంగారెడ్డి జైలులో ఫీల్ ద జైల్ కాన్సెప్ట్‌ ను ప్రవేశపెట్టగా, ఇప్పటివరకు 47 మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. వారిలో ఇద్దరు విదేశీయులు, ఏడుగురు మహిళలు, ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి, ఏసీటీవో కూడా ఉండడం విశేషం. 

  • Loading...

More Telugu News