Kuppam: వైసీపీలో నీతి, నిజాయతీలకు చోటు లేదు!: టీడీపీలో చేరిన సుబ్రహ్మణ్యం రెడ్డి విమర్శ

  • కుప్పంలో చంద్రబాబుపై మూడుసార్లు పోటీ చేసిన సుబ్రహ్మణ్యం రెడ్డి
  • చంద్రబాబుకు అండగా ఉంటానంటూ టీడీపీలో చేరిక 
  • వైకాపాలో కాంట్రాక్టర్లకే గుర్తింపు 

చంద్రబాబు చిరకాల ప్రత్యర్థి, ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత, ప్రస్తుతం వైకాపాలో ఉన్న సుబ్రహ్మణ్యం రెడ్డి, అనూహ్య నిర్ణయం తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 1999 నుంచి 2009 మధ్య చంద్రబాబుపై సుబ్రహ్మణ్యం రెడ్డి వరుసగా మూడు సార్లు పోటీ పడి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన, తెలుగుదేశంలో చేరగా, సుబ్రహ్మణ్యం నీతి, నిజాయితీలు ఉన్న నేతని, టీడీపీలో ఆయన గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడుతానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, వైకాపాలో కాంట్రాక్టర్లకు తప్ప నిజాయితీ గల వారికి గుర్తింపు లేదని విమర్శించారు. చంద్రబాబుకు అండగా నిలుస్తానని, విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తలెత్తుకొని నిలబడేలా చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News