economic survey: ఆర్థిక సర్వేలో హిందీ సినిమా డైలాగులు, పాటలు
- న్యాయంలో జాప్యం వర్ణనకు సన్నీ డియోల్ డైలాగ్
- వాతావరణ మార్పుల వివరణకు ఉపకార్ సినిమా పాట
- ఆర్థిక సర్వేను నిన్న విడుదల చేసిన కేంద్రం
2017-18 ఆర్థిక సర్వేలో సమస్యలను సరిగా అర్థమయ్యే రీతిలో వివరణ ఇచ్చేందుకు కొన్ని బాలీవుడ్ సినిమా డైలాగులను, పాటల్లోని పదాలను ఉపయోగించారు. వీటిలో 'దామిని' సినిమాలో సన్నీ డియోల్ డైలాగ్ 'తారీఖ్ పర్ తారీఖ్' ప్రముఖంగా కనిపిస్తోంది. దేశంలో కేసులను పరిష్కరించడంలో న్యాయవ్యవస్థ చేస్తున్న జాప్యాన్ని వర్ణించడానికి ఈ డైలాగ్‌ను ఉపయోగించారు. తేదీల మీద తేదీలు చెప్పుకుంటూ కేసులు వాయిదా వేయడం వల్ల ఆర్థిక పురోగతికి భంగం కలుగుతోందని ఆర్థిక సర్వే వెల్లడించింది.
అలాగే వాతావరణ మార్పులు, తదనుగుణంగా రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను వివరించేందుకు మనోజ్ కుమార్ నటించిన 'ఉపకార్' సినిమాలోని పాటను ఉపయోగించారు. 'మేరే దేశ్ కీ ధర్తీ సోనా ఉగ్లే హీరే మోతీ' (నా దేశ మట్టిలో పండే పంటలు బంగారం, వజ్రాలు, ముత్యాల లాంటివి) అనే పాట పదాలను ఆర్థిక సర్వేలో వాడారు.