India: భారత్, పాక్ కుర్రోళ్ల మ్యాచ్ లో క్రీడాస్ఫూర్తికి 'సాహో'... చిత్రాలు చూడండి!

- పాక్ జట్టు ఆటగాళ్లకు మనోళ్ల సాయం
- భారత ప్లేయర్స్ షూ లేస్ సరిచేసిన పాక్ యువ క్రికెటర్లు
- క్రీడాస్ఫూర్తిపై ప్రశంసల వెల్లువ

ఇక న్యూజిలాండ్ లో అండర్ 19 క్రికెట్ పోటీలు జరుగుతున్న వేళ, క్రీడాకారుల మధ్య వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తికి 'సాహో' అనాల్సిందే. మైదానంలో పాక్ జట్టు ఆటగాళ్లకు మనోళ్లు సాయపడటం, మనోళ్లకు పాక్ ప్లేయర్స్ సహకరించడం చూసిన వాళ్లు జయాపజయాలు ఎలా ఉన్నా, ఇరు జట్ల యువకులనూ అభినందిస్తున్నారు.

కీలకమైన మ్యాచ్ లో వీరు ఎంతో పరిణతితో కూడిన క్రీడాస్ఫూర్తిని చూపించారని పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇరు దేశాల మెయిన్ టీములు క్రికెట్ ఆడే వేళ ఈ తరహా ఘటనలు కనిపిస్తాయని ఊహించలేమని అంటున్నారు. పాక్ ఆటగాడి షూ లేస్ ఊడిపోతే కట్టిన భారత ప్లేయర్, భారత ప్లేయర్ షూ సరిచేస్తున్న పాక్ క్రికెటర్, శుభమ్ గిల్ సెంచరీ చేసినప్పుడు పాక్ ఆటగాళ్లు వచ్చి అభినందిస్తున్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరూ చూడండి.