ram gopal varma: కీరవాణి ట్వీట్ కు రామ్ గోపాల్ వర్మ రీట్వీట్!

  • వర్మ నన్ను ఓ మెట్టు ఎక్కించాడు
  • నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడు అన్న కీరవాణి
  • కీరవాణిని పిచ్చి జీనియస్ అన్న వర్మ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' అనే లఘు చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. తాజాగా ట్విట్టర్ ద్వారా కీరవాణి స్పందిస్తూ, "వర్మ తెలివితేటలు నన్ను ఓ మెట్టు ఎక్కించాయి. 1991లో రొమాన్స్ ను, 1992లో కామెడీని, 2018లో సెక్స్ కు సంగీతం అందించాను. ఈ ఏడాదిలో ఆయన తీస్తున్న హారర్, వయోలెన్స్ చిత్రాలకు సంగీతం అందించబోతున్నా. నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి థ్యాంక్స్" అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ పై వర్మ స్పందించాడు. 'నువ్వు నాకన్నా పిచ్చోడివి. నీలాంటి పిచ్చి జీనియస్ మాత్రమే క్షణక్షణం నుంచి అన్నమయ్యకు... అక్కడి నుంచి బాహుబలికి... అక్కడి నుంచి గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కు జంప్ కాగలరు' అంటూ ట్వీట్ చేశారు.

ram gopal varma
rgv
keeravani
tollywood
god S*x and truth
  • Loading...

More Telugu News