visakhapatnam: భార్యాభర్తల వీడియో చిత్రీకరించిన ఇద్దరి అరెస్ట్‌!

  • విశాఖలో ఘటన
  • భార్యాభర్తలు సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో చిత్రీకరణ
  • దుండగులను అరెస్ట్ చేసిన పోలీసులు

భార్యాభర్తలు సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో చిత్రీకరించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం ఆగనంపూడి టోల్ గేట్ సమీపంలో లక్ష్మీగణపతినగర్ కు చెందిన ఓ వ్యక్తి వద్ద చిన్నా అనే వ్యక్తి కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్యతో గత కొన్ని రోజులుగా మనస్పర్థలు ఉన్నాయి. దీంతో, వీరిద్దరూ కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో, ఆదివారం నాడు తన కారు యజమాని ఇంటికి తన భార్యను తీసుకుని చిన్నా వెళ్లాడు. అక్కడ గదిలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో కూర్మన్నపాలేనికి చెందిన చినవాసు, ఉమామహేశ్వరరావు అనే యువకులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. దీన్ని గమనించిన చిన్నా కేకలు వేయడంతో ఇద్దరూ పారిపోయారు. దీంతో, ఆయన దువ్వాడ పోలీసులకు జరిగిన ఘటన గురించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

visakhapatnam
video shoot
  • Loading...

More Telugu News