rana: మలయాళ మూవీ షూటింగును మొదలెట్టేసిన రానా!

  • మలయాళ మూవీలో రానా 
  • ట్రావెన్ కోర్ చక్రవర్తి జీవితచరిత్రయే నేపథ్యం
  • తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది

వైవిధ్యభరితమైన కథా కథనాలకు .. పాత్రలకు రానా ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన 'ఘాజీ' .. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన '1945' .. 'హాథీ మేరా సాథీ' సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ కంటెంట్ తో కూడుకున్నవే. ఈ సినిమాలు కాకుండా ఆయన ఓ మలయాళ ప్రాజెక్టును కూడా ఒప్పుకున్నాడు.

ట్రావెన్ కోర్ చక్రవర్తి మార్తాండ వర్మ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. 1729 - 1758 మధ్య కాలంలో ట్రావెన్ కోర్ ప్రాంతాన్ని పరిపాలించిన చక్రవర్తి మార్తాండవర్మగా రానా ఈ సినిమాలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మలయాళంలోనూ రానా బిజీ అవుతాడేమో చూడాలి మరి.    

  • Loading...

More Telugu News