India: పాక్ ఆటగాళ్ల స్కోర్ కార్డు... 2, 7, 18, 1, 4, 4, 15, 1, 0, 1... 203 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం!

  • పరుగుల వేటలో చతికిల పడ్డ పాకిస్థాన్
  • 69 పరుగులకే ఆలౌట్ అయిన పాక్
  • అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్ కు భారత్

అండర్-19 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత కుర్రాళ్ల జట్టు 203 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. నిప్పులు చెరిగే బంతులేస్తున్న భారత బౌలర్ల ముందు పాకిస్థాన్ ఆటగాళ్లు తేలిపోయారు. తొలుత శుభమ్ గిల్ సెంచరీతో చెలరేగి ఆడగా, భారత జట్టు 272 పరుగులు సాధించింది. ఆపై 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 69 పరుగులకే ఆలౌటైంది.

పాక్ జట్టులో ఇమ్రాన్ 2, జయీద్ 7, రోహాయిల్ 18, జార్యాబ్ 1, అమ్మద్ 4, తాహా 4, సాద్ 15, హసన్ 1, షహీన్ 0, అర్షాద్ 1 పరుగు చేయగా, మూసా 11 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో ఈషాన్ 4 వికెట్లు తీసి రాణించగా, శివ, రియాన్ లకు చెరో రెండు, అనుకుల్, అభిషేక్ లకు చెరో వికెట్ లభించాయి. ఈ మ్యాచ్ లో విజయంతో ఇండియా ఫైనల్స్ కు ప్రవేశించింది. ఇక తౌరంగా స్టేడియంలో శనివారం నాడు ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

India
Pakistan
Under 19 World cup
Cricket
  • Loading...

More Telugu News