Bahubali: ఎంఎం కీరవాణి కూడా కాపీ మాస్టరేనట... 'సాక్ష్యం ఇదిగో' అంటున్న సోషల్ మీడియా... వీడియో చూడండి!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-dc2a3a6b3cc72eb28ada15e6f2c2705be55ae87c.jpg)
- 'బాహుబలి' కీలక సన్నివేశం మ్యూజిక్ కాపీయే
- అక్కినేని 'కీలుగుర్రం' నుంచి తీసుకున్నాడట
- నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
టాలీవుడ్ సత్తాను నేల నాలుగు చెరగులా చాటిన 'బాహుబలి' చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఎంఎం కీరవాణి కూడా కాపీ మాస్టరేనట. బాహుబలి చిత్రంలో ఓ కీలక సన్నివేశానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఆయన అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'కీలుగుర్రం' చిత్రం నుంచి కాపీ చేశారట. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఆ రెండు సన్నివేశాలనూ చూపుతూ నెట్టింట వైరల్ అవుతోంది. తాము కాపీ చేయడం లేదని, అది కేవలం స్ఫూర్తి మాత్రమే అని చెబుతున్నా ఆరోపణలు మాత్రం ఆగటం లేదు. ఇక బాహుబలిలోని సన్నివేశాన్ని, కీలుగుర్రంలోని మ్యూజిక్ ను పోలుస్తూ కలిపిన వీడియోను మీరూ చూడండి.