Patna: గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ, లైవ్ లో యువకుడి ఆత్మహత్య!

  • చచ్చి పోతానని బెదిరిస్తూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కిన యువకుడు
  • తల్లిదండ్రులు వచ్చేలోపే పోయిన ప్రాణాలు
  • పట్నాలో ఘటన, కేసు నమోదు

తనను పెళ్లి చేసుకోకుంటే చచ్చి పోతానని బెదిరిస్తూనే, పొరపాటున ట్రిగ్గర్ పేల్చుకుని ఓ యువకుడు మరణించిన హృదయ విదారక ఘటన పట్నాలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉభ్ హాస్ కుమార్ అనే యువకుడికి ఓ అమ్మాయితో పరిచయం ఉంది. ఇటీవల అతనికి పెళ్లి నిశ్చయం చేశారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో తన ప్రియురాలికి ఫోన్ చేసిన కుమార్, దాదాపు 2 గంటల పాటు మాట్లాడాడు. ఆమెతో గొడవపడ్డాడు. ఆపై వీడియో కాల్ చేశాడు. ఆమె కనిపించగానే, తుపాకి తీసి బులెట్లు లోడ్ చేశాడు.

దాన్ని చూపిన ఆమె, ఎలాంటి అఘాయిత్యమూ చేయవద్దని వేడుకుంది. ఆమెను చూస్తూనే ఆత్మహత్య చేసుకుంటాను చూడమని చెబుతూ, తలకు తుపాకిని గురి పెట్టుకున్నాడు. ఆ సమయంలో పొరపాటున ట్రిగ్గర్ కు అతని వేలు తగలడంతో పెద్ద శబ్దంతో తుపాకి పేలింది. ఆ శబ్దం విన్న ఇంట్లోని వారు వచ్చేసరికే అతను మరణించాడు. ఫోనులో తుపాకి శబ్దాన్ని మాత్రమే విన్న ప్రియురాలు, ఆపై అతనికి 80 మార్లు కాల్ చేసింది. ఇక అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, తల్లిదండ్రులు నిశ్చయించిన వివాహం ఇష్టం లేకనే అతను ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు.

Patna
Sucide
Marriage
Pistol
  • Loading...

More Telugu News