Telugudesam: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు అరుదైన గౌరవం!

  • ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీస్ గవర్నర్, గ్లోబల్ బ్యాటరీ అలయన్స్ ప్రిన్సిపల్ గా గల్లా జయదేవ్
  • ఈ మేరకు దావోస్ సదస్సు నిర్ణయం
  • తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్న ఎంపీ గల్లా  

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న టీడీపీ ఎంపీ, ‘అమరరాజా’ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ ఎంపీ గల్లా జయదేవ్ కు ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత గౌరవం దక్కింది. తమ సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారంలో ఆయన ఎంతో అనుభవం గడించారు. ఈ విషయాన్ని గుర్తించిన దావోస్ సదస్సు ఆయనను ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీస్ గవర్నర్, గ్లోబల్ బ్యాటరీ అలయన్స్ ప్రిన్సిపల్ గా నియమించింది.

ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలియజేసిన గల్లా జయదేవ్ తన సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ప్రపంచ ఆర్థిక సదస్సులు జరిగినా ఈ హోదాలో ఆయన పాల్గొనే అవకాశం ఉంటుంది. జయదేవ్ కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై పార్టీ నాయకులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Telugudesam
galla jaydev
  • Error fetching data: Network response was not ok

More Telugu News