bsnl: కస్టమర్లకు షాక్.. ఆదివారం ఫ్రీకాల్స్ ను ఆపేస్తున్న టెలికాం దిగ్గజం

  • సండే ఫ్రీ కాలింగ్ కు బీఎస్ఎన్ఎల్ స్వస్తి
  • ఫ్రీ నైట్ కాలింగ్ కూడా 10.30 తర్వాత నుంచే
  • కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వరంగ టెలికాం ఆపరేటర్  

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ల్యాండ్ లైన్ ద్వారా ఆదివారంనాడు చేసుకునే ఫ్రీకాల్స్ సౌకర్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఈ నిలిపివేత అమల్లోకి వస్తోంది. దీంతో, మిగిలిన రోజుల్లో కాల్స్ కు ఛార్జ్ చేసినట్టుగానే ఆదివారాల్లో కూడా ఛార్జ్ చేయబోతున్నారు. పాత కస్టమర్లతో పాటు, కొత్త కస్టమర్లకు కూడా ఇది వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

మరోవైపు ఈ నెల మధ్యలో రాత్రి పూట ఫ్రీగా చేసుకునే కాల్స్ సదుపాయాన్ని కూడా బీఎస్ఎన్ఎల్ సమీక్షించింది. ఫ్రీ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని రాత్రి 9 గంటల నుంచి కాకుండా 10.30 నుంచి చేసుకునేలా మార్చింది. 2016 ఆగస్టు 21న ఫ్రీ నైట్ కాలింగ్, ఫ్రీ సండే కాలింగ్ సదుపాయాలను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News