bhumana karunakar reddy: చంద్రబాబు వణికిపోతున్నారు: భూమన కరుణాకర్ రెడ్డి

  • జగన్ పాదయాత్ర టీడీపీకి అంతిమయాత్ర
  • జగన్ కు లభిస్తున్న ప్రజాదరణతో చంద్రబాబు వణుకుతున్నారు
  • టీడీపీకి అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయి

జగన్ చేస్తున్న పాదయాత్ర అధికార టీడీపీకి అంతిమయాత్ర కాబోతోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్ కు లభిస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు వణికిపోతున్నారని చెప్పారు. టీడీపీకి అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తిరుపతిలో 'వాక్ విత్ జగనన్న' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. మరోవైపు నగరిలో రోజా ఆధ్వర్యంలో 'వాక్ విత్ జగనన్న' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొత్తపేటలోని వినాయక గుడి నుంచి ఓంశక్తి ఆలయం వరకు ఆమె పాదయాత్ర చేశారు.

bhumana karunakar reddy
Chandrababu
Jagan
  • Loading...

More Telugu News