ntr: రాజమౌళి సినిమాలో విలన్ గా యంగ్ హీరో?

  • ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి
  • కథను అందించిన విజయేంద్ర ప్రసాద్  
  • పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసిన రాజమౌళి    

'బాహుబలి 2' ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలమైంది. ఆ తరువాత రాజమౌళి నుంచి వచ్చే సినిమా కోసం అంతా ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి తదుపరి సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమాకి కూడా విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. పూర్తి స్క్రిప్ట్ ను రాజమౌళి సిద్ధం చేసుకున్నారు.

 ఇక హీరోలతో తలపడే విలన్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుంది. ఈ పాత్ర కోసం రాజమౌళి ఒక యంగ్ హీరోను సంప్రదించారట. ఆ హీరో అయితేనే విలన్ పాత్రకు న్యాయం జరుగుతుందని ఆయన భావిస్తున్నారని సమాచారం. రాజమౌళి అడిగితే కాదనే హీరోలు ఎవరుంటారు? ఆ హీరో ఈ సినిమాలో విలన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే అసలా హీరో ఎవరనే ఆసక్తే అందరిలో తలెత్తుతోంది. ఆయన ఎవరనేది త్వరలో తెలియనుంది.   

  • Loading...

More Telugu News