ntr: ఎన్టీఆర్ గారు నా దృష్టిలో భగవత్ స్వరూపంతో సమానం!: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి

  • నాటి సీఎం ఎన్టీఆర్ వద్ద పని చేసిన మాజీ ఐఏఎస్ రమణాచారి
  • నాడు తన పదవి పోయినప్పుడు ఎన్టీఆర్ చాలా బాధపడ్డారు
  • ఆయన పడిన బాధను నేను స్వయంగా చూశా
  • ఓ ఇంటర్వ్యూలో నాటి విషయాలను ప్రస్తావించిన రమణాచారి

మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు తన దృష్టిలో భగవత్ స్వరూపంతో సమానమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్ అధికారి రమణాచారి అన్నారు. నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆయన వద్ద, ఆ తర్వాత చంద్రబాబు వద్ద పని చేసిన రమణాచారి నాటి విషయాలను ప్రస్తావించారు.

‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘స్థిత ప్రజ్ఞులు తమకు బాధ కలిగినా కూడా ప్రకటించరు. ఎన్టీ రామారావు గారు నా దృష్టిలో భగవత్ స్వరూపం. ఈరోజుకీ ఆయన్ని అభిమానించడానికి కారణం..ఆయనలో భగవత్ అంశ ఉంది కాబట్టే. ఎన్టీఆర్ రాముడిగా, కృష్ణుడిగా మనందరికి ఆరాధ్యనీయులు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అవినీతికి ఆయన దూరంగా ఉండేవారు. వ్యవస్థలో అవినీతి ఉంటే ఉండొచ్చు.

 సమాజమే నాకు దేవాలయం అని చెప్పిన మొట్టమొదటి రాజకీయనాయకుడు ఎన్టీఆర్. ఆయనది చాలా సున్నితమైన మనసు..చిన్నపిల్లవాడి మనస్తత్వం. ఊరికే ఆయన్ని ఎవరైనా గిల్లినా కూడా గిలగిలలాడిపోయే మనిషిని...ఆయన్ని కుర్చీ(పదవి) నుంచి కిందకు దింపేస్తే ఎంత బాధపడ్డారో నేను స్వయంగా చూశాను. ఆ స్థిత ప్రజ్ఞుడికి నేను నమస్కరిస్తున్నాను. అటువంటి ఆయన కూడా బాధపడటమనేది జరుగుతున్నప్పుడు, బాధ పడాల్సి వచ్చినప్పుడు.. మనిషి ఎలా ప్రవర్తించాలనేది ఆయన నుంచే నేను కూడా నేర్చుకున్నానని అనుకుంటున్నాను.

నాడు ఎన్టీఆర్ తన బాధ గురించి ఎంతో మందికి చెప్పుకున్నారు..విలవిలా ఏడ్చారు. తనకు తానుగా సంభాళించుకున్నారు. ఒకరకంగా ఆయన మీద ఈ ఘటన చాలా ప్రభావం చూపింది. 1999లో చంద్రబాబునాయుడుగారు నన్ను దూరంగా పెట్టారు. 2003లో మళ్లీ చంద్రబాబు దగ్గర ఉన్నాను. అప్పుడు ఎండోమెంట్స్ కమిషనర్ గా పనిచేయాలని, ఎన్నికలకు ముందు నా దగ్గర ఉండాలని నాడు చంద్రబాబు నాయుడు నాతో అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’ అని రమణాచారి చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News