Jagan: 10 లక్షల కిలోమీటర్లు నడిచినా ఆయన సీఎం కాలేరు: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

  • నేనే సీఎం అని జగన్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది
  • ఆయనను ప్రజలు నమ్మడం లేదు
  • టీడీపీతో జనసేన ఉంటుందని భావిస్తున్నా

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. 10 లక్షల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా జగన్ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. ప్రజలు ఇస్తే వచ్చేది సీఎం పదవి అని చెప్పారు. నేనే సీఎం... నేనే సీఎం అంటూ జగన్ ప్రతిరోజూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. అవినీతి కేసుల్లో ఉన్న జగన్ ను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపు వెనక పవన్ కల్యాణ్ పాత్ర ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీతో కలసి జనసేన ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ దే తుది నిర్ణయమని చెప్పారు. 

Jagan
jagan padayatra
chintamaneni prabhakar
Telugudesam
janasena
Pawan Kalyan
  • Loading...

More Telugu News