Donald Trump: అప్పుడప్పుడు మంచం మీద ప‌డుకొని కూడా ట్వీట్ చేస్తా: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌

  • కొన్నిసార్లు నేను చెబుతుంటే ఇత‌రులు ట్వీట్ చేస్తారు
  • త‌ప్పుడు వార్త‌ల‌పై స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు ట్విట్ట‌ర్ వార‌ధి
  • ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన డొనాల్డ్ ట్రంప్‌

సామాజిక మాధ్య‌మం ట్విట్ట‌ర్‌లో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా క్రియాశీల‌కంగా ఉంటారు. ప్ర‌జ‌ల‌కు ఏదైనా చెప్పాల‌న్నా, ఏ విష‌యం గురించైనా కామెంట్ చేయాల‌న్నా, పాల‌సీలు, హెచ్చ‌రిక‌లు, ఖండ‌న‌లు ఇలా అన్ని విష‌యాల‌కూ ఆయ‌న ట్విట్ట‌ర్‌నే వార‌ధిగా వాడుకుంటారు. ఇటీవ‌ల ఓ బ్రిటీష్‌ టీవీ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను మంచం మీద ప‌డుకుని కూడా కొన్నిసార్లు ట్వీట్ చేస్తాన‌ని, అప్పుడప్పుడు తాను చెబుతుంటే ఇత‌రులు ట్వీట్ టైప్ చేస్తుంటార‌ని ట్రంప్ అన్నారు.

ఏమాత్రం ఆలోచించకుండా పెట్టిన‌ట్టుగా అనిపించే ట్రంప్ ట్వీట్లను చాలా మంది విమ‌ర్శిస్తుంటారు. కానీ ట్రంప్ మాత్రం త‌ప్పుడు వార్త‌లపై స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకే తాను ట్విట్ట‌ర్‌ను ఉప‌యోగిస్తాన‌ని చెబుతున్నారు. 'అలాంటి సామాజిక మాధ్య‌మం ఉండ‌క‌పోయి ఉంటే... నన్ను నేను స‌మ‌ర్థించుకునే అవ‌కాశం క‌లిగి ఉండేది కాదు. ఒక్క‌రోజులో నా గురించి ల‌క్ష‌ల కొద్దీ న‌కిలీ వార్త‌లు వ‌స్తుంటాయి. వాటి నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌రల్చ‌డానికి ట్వీట్లు చేస్తుంటాను' అని ట్రంప్ అన్నారు.

రోజంతా తాను వైట్‌హౌస్ ప‌నుల్లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ముఖ్య‌మైన విష‌యాల గురించి స్పందించ‌డానికి పొద్దున్న‌గానీ, సాయంత్రం పూట‌గానీ ఎక్కువ‌గా ట్వీట్లు చేస్తాన‌ని ట్రంప్ తెలిపారు. అలాగే ఆయ‌న ఆహార‌పు అల‌వాట్ల గురించి, బ్రిట‌న్‌లో త‌న‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి కూడా ట్రంప్ ఈ ఇంట‌ర్వ్యూలో చ‌ర్చించారు.

  • Loading...

More Telugu News