emargency: అంబులెన్స్ ఉద్యోగికి ఫోన్ చేసి అసందర్భ సంభాషణ!

  • అంబులెన్స్ కి ఫోన్ చేసి కోడి గుడ్ల గురించి అడిగిన మహిళ 
  • ఆకతాయి ప్రశ్నలు అడగకూడదని చివాట్లు పెట్టిన ఉగ్యోగి 
  • బ్రిటన్ లో చోటు చేసుకున్న సంఘటన 

గుడ్డు పగిలిపోయింది. ఆ బాక్స్ లోని మిగిలిన గుడ్లన్నీ మార్చి, ఫ్రిజ్ లో పెట్టాను పర్లేదా? అంటూ ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేసిన మహిళను ఏం చేయాలని బ్రిటన్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... బ్రిటన్‌ లోని నాటింగ్హామ్‌ లో ఈస్ట్‌ మిడ్‌ ల్యాండ్స్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ నెంబర్ (999) కు అర్ధరాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎమర్జెన్సీ సర్వీస్ కావడంతో ఫోన్ ఎత్తిన సర్వీస్ అధికారి... రోగి శ్వాస తీసుకోగలుతున్నాడా? అని పదేపదే ప్రశ్నించాడు. దీనిని పట్టించుకోని సదరు మహిళ... 'నాకు మీ నుంచి ఒక సలహా కావాలి' అని అడిగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది.

అధికారి : రోగి మీరేనా?
మహిళ: (మౌనం) మీ సలహా కావాలి
అధికారి: సరే ఇంతకీ మీకేం కావాలి?
మహిళ: మా ఫ్రిజ్‌లో ఒక బాక్సు నిండా గుడ్లు ఉన్నాయి. అందులో ఒకటి పగిలిపోయింది. దీంతో నేను మిగతా గుడ్లన్నిటినీ బాక్సు మూతలోకి మార్చాను. ఆ బాక్సు రాత్రంతా తెరిచే ఉంది. గుడ్ల బాక్సును రాత్రంతా ఫ్రిజ్‌లో తెరిచి పెట్టొచ్చా?
అధికారి: (ఆశ్చర్యపోయి) ఇది అంబులెన్స్‌ సర్వీస్‌... అత్యవసరమైతేనే దీనికి ఫోన్‌ చేయాలి
అని చెప్పి, ఎంతోమంది ఎమర్జెన్సీ కోసం వాడే నెంబర్ ను ఆకతాయి పనికి వాడకూడదని చీవాట్లు పెట్టారు. అనంతరం తమ విధులకు ఎలా ఆటంకం కలుగుతుందో చెబుతూ, ఆ కాల్ రికార్డింగ్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది వైరల్ గా మారింది. దానిని మీరు కూడా చూడండి. అలాంటి మహిళలపై చర్యలు తీసుకోవాలని పలువురు మండిపడుతున్నారు.

emargency
999
ambulance
service
  • Error fetching data: Network response was not ok

More Telugu News