Pawan Kalyan: బాలయ్య ఇలాకాకు బయలుదేరిన పవన్ కల్యాణ్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-113570c4a306e312ea8f8d67a9e42af7bea15395.jpg)
- నేడు హిందూపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్
- ఈ ఉదయం సత్యసాయి సమాధిని దర్శించుకున్న పవర్ స్టార్
- సత్యసాయి ఆరాధ్యనీయుడన్న పవర్ స్టార్
నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో నేడు పవన్ కల్యాణ్ పర్యటన సాగనుండగా, దీన్ని ఘనవిజయం చేసేందుకు జనసేన కార్యకర్తలు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పవన్ కల్యాణ్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ప్రస్తుత పర్యటన ఎంతో కీలకమని జనసేన నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పుట్టపర్తిలో ఉన్న పవన్, ఈ ఉదయం సత్యసాయి సమాధిని, అత్యాధునిక ఆసుపత్రిని సందర్శించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-19a04c474a1f73b1f33723801072099baa9c462d.jpg)