Social Media: అమెరికా మోడల్ కు విమానంలో ఘోర అవమానం!

  • న్యూయార్క్ కు చెందిన ఫిట్ నెస్ మోడల్ జెన్ సెల్టర్
  • అమెరికన్ ఎయిర్ లైన్స్ వివాదం
  • విమానం నుంచి కిందికి దించేసిన సిబ్బంది

అమెరికాకు చెందిన ప్రముఖ ఫిట్‌ నెస్‌ మోడల్‌ జెన్‌ సెల్టర్‌ ఆ దేశానికి చెందిన ఎయిర్ లైన్స్ విమానంలో ఘోర అవమానానికి గురైంది. తీవ్ర వేదనకు గురైన సెల్టర్ సోషల్ మీడియా మాధ్యమంగా ఆమె తన బాధను అభిమానులతో పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే... న్యూయార్క్‌ కు చెందిన జెన్ సెల్టర్ ఫిట్ నెస్ కు సంబంధించిన చిట్కాలు చెబుతూ సెలబ్రిటీగా మారింది. మియామి వెళ్లిన ఆమె తిరిగి న్యూయార్క్ చేరేందుకు అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం ఎక్కారు.

విమానం బయలుదేరడానికి రెండున్నర గంటలు ఆలస్యం కావడంతో, ఆమె సీట్లో కూర్చోలేక నిల్చున్నారు. దీంతో విమాన సిబ్బంది ఆమెను సీట్లో కూర్చోవాలని సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె ఎంతసేపు కూర్చోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారు పైలట్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో విమానంలోకి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను బలవంతంగా విమానంలోంచి దించేశారు. ఆమె పక్కనున్నవారు వారిని వారించినా వారు వినకపోవడం విశేషం. ఈ సందర్భంగా తీసిన సెల్ ఫోన్ వీడియోలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News