India: అండర్ 19 వరల్డ్ కప్: రేపు భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోరు... స్టేడియం ఫుల్!

  • క్రీస్ట్ చర్చ్ లో సెమీస్ ఆడనున్న రెండు దేశాలు 
  • టికెట్లు హాట్ కేకులే
  • తొలి సెమీస్ లో ఆఫ్గన్ ను ఓడించిన ఆసీస్

క్రికెట్ లో చిరకాల శత్రువులైన భారత్, పాకిస్థాన్ మధ్య రేపు న్యూజిలాండ్ లో కీలకమైన పోరాటం సాగనుంది. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా క్రీస్ట్ చర్చ్ లోని హాగ్లీ ఓవల్ మైదానంలో ఇండియా, పాక్ లు సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం, రేపు తెల్లవారుజామున 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే, అది ప్రధాన టీమ్ ఆడినా, అండర్ 19 ఆడినా ఒకటేనని ఈ మ్యాచ్ కి అమ్ముడైన టికెట్ల సంఖ్యే తెలుపుతోంది.

స్టేడియం కెపాసిటీ మొత్తం అమ్ముడయ్యాయని, అభిమానుల నుంచి వచ్చే డిమాండ్ ను బట్టి అదనపు స్టాండ్ ఏర్పాటుకు వీలుందని స్టేడియం నిర్వాహకులు ప్రకటించారు. కాగా, తొలి సెమీస్ లో పసికూన ఆఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియాను దాదాపు ఓడించినంత పని చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా, ఆఫ్గన్ జట్టు 181 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక, భారత్, పాక్ మ్యాచ్ విజేతతో ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

India
Pakistan
U-19 Cricket
Australia
Afghanisthan
  • Loading...

More Telugu News