Nara Lokesh: లాస్ ఏంజెలెస్ లో నారా లోకేష్ రోడ్ షో!

  • అమెరికా పర్యటనలో బిజీబిజీగా లోకేష్
  • వ్యాపారవేత్తలతో భేటీలు
  • ఏపీకి వస్తామన్న ఎలక్టో హెల్త్ కేర్ మెడ్ టెక్ సంస్థ

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. లాస్ ఏంజెలెస్ చేరుకున్న ఆయన ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో నిర్వహించారు. ఇందులో భాగంగా ఎలక్టో హెల్త్ కేర్ సీఈవో లక్ష్మణ్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాస్పిటల్ మేనేజ్ మెంట్, హెల్త్ సర్వీసెలో ఉన్న హెల్త్ కేర్ మెడ్ టెక్ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

 రాష్ట్రంలో మెడికల్ పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, కంపెనీలకు రాయితీలు కల్పిస్తున్నామని తెలిపారు. ఏపీలో హెల్త్ కేర్ రంగానికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ, ఇండియాలో తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వ పాలసీలు, రాయితీల గురించి తెలుసుకున్నామని, త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళికతో ఏపీకి వస్తామని చెప్పారు. 

Nara Lokesh
investment road show
Alecto Healthcare Services
  • Loading...

More Telugu News