Poonam Kaur: తన ట్విట్టర్ వ్యాఖ్యలపై పూనమ్ ఇచ్చిన వివరణకు సంతృప్తి పడని ఫ్యాన్స్!

  • నా ట్వీట్ ఎవరినీ ఉద్దేశించినది కాదు
  • ఓ 14 ఏళ్ల బాలికను కన్న తండ్రే అమ్మేశాడు
  • విషయం తెలిసి ఈ వ్యాఖ్యలు చేశానన్న పూనమ్
  • అయినా ఆగని ఫ్యాన్స్!

సిద్ధాంతాలు మారిపోయాయని, అవసరాల కోసం మారిపోయే నిజాయతీ గుణం ఏంటని ప్రశ్నించి కలకలం రేపిన పూనమ్ కౌర్ పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు విరుచుకుపడుతున్న వేళ, తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చుకుంది. తన వ్యాఖ్య ఎవరినీ ఉద్దేశించినదని కాదని స్పష్టం చేసింది.

"నా ట్వీట్ ప్రత్యేకించి ఎవరినీ ఉద్దేశించినది కాదు. ఓ బాలిక బాధను ఇలా వ్యక్తపరిచాను. ఓ బాలికను 14 ఏళ్లకే సొంత తండ్రి అమ్మేశాడు. ఆమెకు 24 ఏళ్లు వచ్చేసరికే ఏడేళ్ల బిడ్డ ఉన్నాడు" అని వెల్లడించింది. డబ్బు కోసం కన్న కూతురిని అమ్మిన వ్యక్తుల గురించి ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పింది.

కాగా, అంతకుముందు "డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు... మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ... నీ గుణం ఏంటి?" అని పూనమ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక పూనమ్ వివరణ తరువాత కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ విమర్శలకు పుల్ స్టాప్ పడలేదు. ఆమె వివరణ నమ్మశక్యంగా లేదంటూ తాము తిట్టాలనుకున్న తిట్లు తిట్టేస్తున్నారు.

Poonam Kaur
Pawan Kalyan
Twitter
fans
  • Loading...

More Telugu News