Pawan Kalyan: నువ్వు పవన్ గురించే అన్నావు... చాలా ఇబ్బందులు పడతావు: పూనమ్ పై ఫ్యాన్స్ ఫైర్

  • ట్విట్టర్ వేదికగా పూనమ్ వ్యాఖ్యల కలకలం
  • అండగా ఉన్న వ్యక్తిపైనే అభాండాలా?
  • తగిన శాస్తి జరుగుతుందని ఫ్యాన్స్ హెచ్చరిక

'డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు' అంటూ నటి పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యల తరువాత ఆమెపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినప్పటికీ, చేసిన వ్యాఖ్యలు తమ హీరోను ఉద్దేశించినవేనని భావిస్తూ, నిప్పులు చెరుగుతున్నారు. తనకు అండగా ఉన్న వ్యక్తిపైనే అభాండాలు వేస్తోందని, ఆమెకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

పూనమ్ నాటకాలు ఆడుతోందని, తరువాతి సినిమాల గురించి ట్వీట్లు వేసుకుంటే బాగుంటుంది గానీ, పేరు చెప్పకుండా ఇలా ఆరోపణలు చేస్తే తగిన శాస్తి జరిగి తీరుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక పూనమ్ టీవీ చానల్స్ కు వెళ్లాలని సెటైర్లు వేస్తున్నారు. పబ్లిసిటీ కోసం కాంట్రవర్శీ సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె నిజమే చెప్పిందని కూడా అంటున్నారు.

Pawan Kalyan
Poonam Kaur
Twitter
Fans
  • Loading...

More Telugu News