team india: టీమిండియా టీ20 జట్టులోకి రైనా... సఫారీ సిరీస్ కు జట్టు ఎంపిక!

  • ఫిబ్రవరి 1 నుంచి సౌతాఫ్రికాతో వన్డే సిరీస్
  • ఫిబ్రవరి 18 నుంచి టీ20 సిరీస్
  • జట్టులోకి వచ్చిన ఆల్ రౌండర్ సురేశ్ రైనా

సఫారీ జట్టుతో టెస్టు సిరీస్ ఓటమి నేపథ్యంలో వన్డే, టీ20 సిరీస్ లను దక్కించుకోవాలని భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 సిరీస్ కు సరైన జట్టును ఎంపిక చేశామని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. టీ20లు ఫిబ్రవరి 18, 21, 24 తేదీల్లో జరగనుండగా, వన్డే సిరీస్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే జట్టు సౌతాఫ్రికాలో ప్రాక్టీస్ ప్రారంభించగా, టీ20 సిరీస్ కు రైనా భారత జట్టులోకి మళ్లీ ఎంపికయ్యాడు.

జట్టు వివరాల్లోకి వెళ్తే... విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, మహేంద్ర సింగ్ ధోని, కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, మనీష్‌ పాండే, అక్షర్‌ పటేల్‌, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ ప్రీత్‌ బుమ్రా, జయదేవ్‌ ఉనద్కత్‌, శార్దుల్‌ థాకూర్‌ లతో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో బలమైన జట్టును ఎంపిక చేసింది. 

team india
Cricket
India
south africa
  • Loading...

More Telugu News