islam: ‘జుమ్మా’కు ఇమామ్ గా వ్యవహరించిన తొలి మహిళ!

  • ఇమామ్ గా వ్యవహరించిన కేరళ మహిళ జమిత
  • ఇలా జరగడం దేశంలోనే తొలిసారి 
  • పురుషులే ఇమామ్ గా ఉండాలని ఖురాన్ లో లేదన్న జమిత

ముస్లింలు ప్రతి శుక్రవారం జరిపే సామూహిక ప్రార్థన ‘జుమ్మా’కు పురుషులు ఇమామ్ లుగా వ్యవహరించడం ఆనవాయతి. అయితే, కేరళలో ఇటీవల నిర్వహించిన ‘జుమ్మా’కు ఓ మహిళ ఇమామ్ గా వ్యవహరించారు. ‘జుమ్మా’కు ఓ మహిళ ఇమామ్ గా వ్యవహరించడం దేశంలోనే ఇది ప్రథమం. కేరళలోని ఖురాన్ సున్నత్ సంఘానికి జమిత (34) ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

మలప్పురంలో సంఘం కార్యాలయంలో గత శుక్రవారం నిర్వహించిన ‘జుమ్మా’ ఆమె ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే, ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు వచ్చాయి. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ, తమ మత గ్రంథం పవిత్ర ఖురాన్ ప్రకారం, స్త్రీ, పురుషులు సమానులని, ఇమామ్ గా పురుషులే వ్యవహరించాలని, మహిళలు వ్యవహరించకూడదని అందులో ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఇకపై తమ సంఘం కేంద్ర కమిటీ కార్యాలయంలో నిర్వహించే ‘జుమ్మా’కు తానే ఇమామ్ గా వ్యవహరిస్తానని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News