Telugudesam: కాపు రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతా: టీడీపీ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు

  •  విశాఖలో మీడియాతో ముత్తంశెట్టి
  • రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు పలకాలి
  • అవసరమైతే వైసీపీతో పాటు అన్ని పార్టీల నాయకులను కలుస్తా

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కాపు రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు అనకాపల్లి టీడీపీ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖపట్టణంలోని తన నివాసంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కోరుతూ లోక్ సభలో ఈ బిల్లు పెడుతున్నట్లు చెప్పారు. కాపు రిజర్వేషన్ల విషయమై ఈ నెల 18న పార్లమెంట్ కు ఓ లేఖ రాశానని, ఈ మేరకు లోక్ సభలో బిల్లు పెట్టేందుకు అనుమతి లభించిందని, ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నానని అన్నారు.

రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు పలకాలని, అవసరమైతే వైసీపీతో పాటు అన్ని పార్టీల నాయకులను కలిసి, కాపుల పరిస్థితిని వివరిస్తానని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిపై ఆయన ప్రశంసలు కురిపించారు. నాడు చంద్రబాబు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చారని, అందుకోసం, ఓ కమిషన్ వేసి.. ఆ నివేదిక వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే బిల్లును ఆమోదింపజేసిన ఘనత చంద్రబాబుదని అన్నారు.

  • Loading...

More Telugu News