Vijayawada: పోటీ పరీక్షలకు మానసిక స్థిరత్వమూ ఉండాలి: కృష్ణా జిల్లా డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి

  • ‘తక్షశిల’లో గ్రూప్ -1, సివిల్స్ మాక్ ఇంటర్వ్యూల నిర్వహణ
  • మాక్ ఇంటర్వ్యూలకు హాజరైతే ఒత్తిడికి దూరం
  • అవసరమైన నైపుణ్యం అలవడుతుంది: లక్ష్మణమూర్తి

కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో మౌఖిక పరీక్షలో అభ్యర్థుల విషయ పరిజ్ఞానంతో పాటు మానసిక స్థిరత్వాన్ని కూడా అంచనా వేస్తారని కృష్ణా జిల్లా డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని తక్షశిల ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ -1 అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూలను ఈరోజు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ బృందానికి ఆయన నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ఇటీవల పోటీ పరీక్షల ఇంటర్వ్యూలలో అభ్యర్థులను సైకాలజీ పరంగా అనేక అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
గ్రూప్ - 1 అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంతో ఒత్తిడికి గురికావలసి వస్తుందని, ఇటువంటి సందర్భంలో కూడా ఎటువంటి స్థితప్రజ్ఞతను చూపుతారన్న దానిని అంచనా వేసే అవకాశం ఇంటర్వ్యూలలో ఉంటుందని అన్నారు.

ఏపీపీఎస్సీ విభజన అనంతరం తొలిసారి అమరావతి కేంద్రంగా మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో రాష్ట్ర విభజన నేపథ్యం, తదనంతర పరిణామాలకు సంబంధించిన అంశాలపై అభ్యర్థులను ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తోందని, సంబంధిత విషయ పరిజ్ఞానంతో పాటు, కరెంట్ అఫైర్స్ విషయంలో నిశిత పరిశీలన అవసరమని అన్నారు.

ఇంటర్వ్యూలకు ముందుగా మాక్ ఇంటర్వ్యూలకు హాజరు కావడం వల్ల ఒత్తిడికి దూరంగా లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన నైపుణ్యం అలవడుతుందని తెలిపారు. అనంతరం, తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఎండీ, చీఫ్ ఫ్యాకల్టీ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సివిల్స్ , గ్రూప్1 శిక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి తమ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, లాభాపేక్ష రహితంగా నిపుణులతో ఈ మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  

  • Loading...

More Telugu News