Pawan Kalyan: ఓపికతో అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం!: కదిరిలో పవన్ కల్యాణ్

  • ‘కదిరి సమస్యల’పై మహిళలతో ఇష్టాగోష్ఠి 
  • గల్ఫ్ కు వలస వెళ్లి మోసపోయిన కార్మికులను ఆదుకుంటాం
  • తెలంగాణ మాదిరి ఓ ప్రత్యేక శాఖను ఏపీ కూడా కేటాయించాలి
  • కదిరి లక్ష్మీనరసింహుని దర్శించుకున్న పవన్ కల్యాణ్

సమస్యల సత్వర పరిష్కారానికి తన దగ్గర మంత్రదండం లేదని, ఓపికతో సమస్యలను పరిష్కరించుకుందామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కదిరిలో అన్నారు. అనంతపురం రెండో రోజు పర్యటనలో భాగంగా కదిరిలో ఈరోజు ఆయన పర్యటించారు. అనంతరం, ‘కదిరి సమస్యల’పై మహిళలతో ఇష్టాగోష్ఠిగా పవన్ మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఒక సమస్యను పరిష్కరించాలంటే, ప్రెస్ మీట్ పెట్టో, లేక రెండు మూడు ముక్కలు మాట్లాడితేనో సమస్యకు పరిష్కారం దొరకదని, ఆ విషయం తనకూ తెలుసని అన్నారు. ఒక సమస్యకు పరిష్కారం కావాలంటే చాలా సహనం కావాలని, చాలా మందిని ఒప్పించాలని, చాలా మందిని భాగస్వామ్యం చేయాలని, ప్రజాక్షేత్రంలో ఉంటానని, సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడతానని అన్నారు.

గల్ఫ్ కు వలస వెళ్లి మోసపోయిన కార్మికులకు సంబంధించిన పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని, గతంలో తాను దుబాయ్ వెళ్లినప్పుడు అక్కడున్న ఏపీకి చెందిన వలస కార్మికులు తన ముందు వాపోయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గల్ఫ్ కు వలస వెళ్లి మోసం పోయిన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిందని, అదే మాదిరి ఏపీ ప్రభుత్వంలో కూడా ఏర్పాటు చేయాలని తాను కోరుతున్నానని పవన్ అన్నారు.

ఈ సమస్యకు సినిమాల్లో లాగా రెండున్నర గంటల్లో పరిష్కారం లభించదని, అధికారులు, రాజకీయ యంత్రాంగం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తాను సమర్పించే లేఖలో ఈ సమస్యను కూడా ప్రస్తావిస్తానని పవన్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News