Chandrababu: 'సూర్యారాధన'కు హాజరై ఆసనాలకు దూరంగా ఉండిపోయిన చంద్రబాబు... కారణమిదే!

  • కుడి చెయ్యి నొప్పిగా ఉందన్న చంద్రబాబు
  • ఆసనాలు వేయవద్దని ఫిజియో థెరపిస్టుల సలహా
  • కుర్చీకే పరిమితమైపోయిన చంద్రబాబు

ఈ ఉదయం విజయవాడలో జరిగిన 'సూర్యారాధన' కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆసనాలకు మాత్రం దూరంగా ఉండిపోయారు. వందలాది మంది విద్యార్థులు, మంత్రులు, ఎమ్మెల్యేలు యోగాసనాలు చేస్తుండగా, ఆయన మాత్రం వారిని చూస్తూ కుర్చీకే పరిమితమై పోయారు.

తన కుడి చెయ్యి నొప్పిగా ఉందని ఆయన అనడంతో, ఆసనాలు వేయవద్దని ఫిజియో థెరపిస్టులు వారించారు. దీంతో వారి సలహా మేరకు చంద్రబాబు కూర్చుండిపోయారు. మంత్రి దేవినేని ఉమ, ఎంపీ కేశినేని తమ యోగాసనాలతో ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కలెక్టర్ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.

Chandrababu
Suryaradhana
Yoga
Vijayawada
  • Loading...

More Telugu News