moon: చందమామ ఈ నెల 31న ‘ఎర్ర’మామగా మారిపోనున్నాడు... ఆకాశంలో మరో అద్భుతం!

  • అదే రోజున చంద్రగ్రహణం
  • ఆ సమయంలో చోటు చేసుకునే మార్పులతో రంగుల్లో తేడా
  • పదేళ్ల కోసారి కనిపించే ప్రత్యేక ఆకర్షణ

తేట తెలుపుదనంతో ప్రకాశవంతంగా నిత్యం రాత్రి వేళ్లల్లో ఈ లోకానికి వెలుగునిచ్చే చందమామ ఈ నెల 31న మాత్రం ఎర్రగా మారిపోనున్నాడు. అంతేకాదు, మామూలు కంటే ఎక్కువ సైజులో సూపర్ మూన్ గా కనిపిస్తాడు. ఈ నెల 31న పౌర్ణమి. అదే రోజు చంద్రగ్రహణం జరగనుంది. పౌర్ణమి రోజున సాధారణ పరిమాణం కంటే 14 శాతం అధిక పరిమాణంలో సూర్యుడు కనిపించనున్నాడు.

ఇంతకీ 31న సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం ఏమిటంటే... గ్రహణ సమయంలో చంద్రుడు భూమి నీడలోకి వెళతాడు. దాంతో సూర్యుడి నుంచి వచ్చే కాంతి ముందుగా భూమిపై పడుతుంది. అక్కడి నుంచి అది చంద్రుడుడిపైకి ప్రకాశించడంతో చందమామ ఎర్రటి వర్ణంలో కనిపిస్తాడు. సూపర్ మూన్ ఎర్రగా ఉండాలనేమీ లేదు. తెలుపు, నారింజ, బంగారు వర్ణంలోనూ కనిపించొచ్చు.  బ్లూమూన్ అని కూడా ఉంది. ఒకే నెలలో రెండు పౌర్ణమి సందర్భాలు వస్తే రెండో పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడిని బ్లూమూన్ అంటారు. మరి ఈ నెల 31న సూపర్ మూన్ తో పాటు బ్లూమూన్ రూపంలోనూ చంద్రుడు కనిపిస్తాడు. ఇలా పదేళ్లకోసారి జరుగుతుంది. ఈ నెల 31న సాయంత్రం 6.21 గంటల నుంచి 7.37 గంటల మధ్య చందమామను కొత్తగా దర్శించుకోవచ్చు.

  • Loading...

More Telugu News