Canada: కెనడాలో గుండెపోటుతో మరణించిన కన్నడ నటుడు

  • దాదాపు 60 చిత్రాల్లో నటించిన చంద్రశేఖర్
  • బాలనటుడిగా ప్రవేశించి రాణించిన చంద్రశేఖర్
  • పరిశ్రమ ప్రముఖుల సంతాపం

కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కెనడాలోని ఒట్టావాలో తన భార్య, కుమార్తెతో కలిసున్న కన్నడ నటుడు ఈడకల్లు చంద్రశేఖర్ (63) గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె తాన్య వెల్లడించారు. బాల నటుడిగా కన్నడ చిత్ర సీమలోకి ప్రవేశించిన చంద్రశేఖర్ 'ఈడకల్లు గుడ్డమెలే' ఘన విజయం తరువాత అదే ఇంటి పేరుగా సుపరిచితుడయ్యారు.

 'సంపంతిగె సవాల్', 'హంసగీతె', 'రాజా నన్న రాజ' వంటి హిట్ చిత్రాల్లో నటించడంతో పాటు 'పూర్వపర' అనే సినిమానూ నిర్మించారు. దాదాపు 60 సినిమాల్లో నటించిన ఆయన ఆఖరి చిత్రం '3 గంటె 3 దిన 30 సెకండ్' మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. కెనడాలోని భారత రాయబార కార్యాలయంలోనూ ఈయన పని చేశారు. చంద్రశేఖర్ మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Canada
Passes Away
Chandrashekar
Kannada
  • Loading...

More Telugu News