Pawan Kalyan: టీడీపీతో జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలివి!

  • ప్రజాభీష్టం మేరకు ముందుకు సాగుతాం
  • పొత్తు గురించి ఎన్నికలప్పుడు మాట్లాడతా
  • అమరావతితో సంబంధం లేదని సీమ వాసులు భావిస్తున్నారు
  • అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న పవన్

ప్రస్తుతం అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ను "2019లో టీడీపీతో కలిసి పని చేస్తారా?" అని మీడియా ఓ ప్రశ్న అడుగగా, ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ ప్రజాభీష్టం మేరకే ముందుకు సాగుతుందని చెప్పిన పవన్, ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందికదా? అని ప్రశ్నించిన పవన్, ఏదైనా పొత్తు గురించి ఆలోచించే సమయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటానని తెలిపారు.

చంద్రబాబు సహా ఎవరితోనూ విభేదాలు తనకు లేవని చెప్పారు. నూతన అమరావతిలో తమ పాత్ర లేకుండా పోయిందని రాయలసీమ వాసులు భావిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఆ ప్రాంతానికి కనెక్టివిటీ కూడా సరిగ్గా లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని వెల్లడించిన పవన్, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. అందరూ కలసి వస్తేనే అనంత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు. హంద్రీనీవా నీటితో అన్ని చెరువులను నింపే విషయమై అధికారులతో మాట్లాడాల్సి వుందని అన్నారు.

  • Loading...

More Telugu News