India: ఒక దీవిని భారత్ కు ఇచ్చేందుకు సీషల్స్ డీల్!
- హిందూ మహాసముద్రంపై చైనా ఆగడాలు
- చెక్ పెట్టేందుకు కదిలిన భారత్
- ఒక దీవిని లీజుకు ఇచ్చేందుకు సిషల్స్ ఒప్పందం
హిందూ మహా సముద్రంపై పట్టును పొంది చైనా ఆగడాలకు చెక్ పెట్టాలన్న భారత వ్యూహానికి సీషల్స్ రూపంలో తోడు దొరికింది. తమ అధీనంలోని ఓ దీవిని ఇండియాకు లీజుకు ఇచ్చేందుకు సీషల్స్ అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది. ఆ దీవిలో భారత్ తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోనుంది. విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జయశంకర్, సీషల్స్ అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు పెట్టారు.
సముద్ర జలాల్లో పైరేట్స్ ను అరికట్టడం నుంచి, ఈ ప్రాంతంపై నిఘా వరకూ రెండు దేశాలూ సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నాయని ఈ సందర్భంగా జై శంకర్ వ్యాఖ్యానించారు. అక్రమంగా మత్స్య సంపద వేట, మానవ తరలింపును కూడా సీషల్స్ కేంద్రంగా భారత్ అడ్డుకుంటుందని ఆయన చెప్పారు. కాగా, ఈ ఒప్పందంపై 2015లోనే సంతకాలు చేయాల్సి వున్నా, అప్పటి పార్లమెంట్ ఈ డీల్ కు ఒప్పుకోలేదు. ఆపై ప్రభుత్వం మారడంతో డీల్ సులువైంది.